ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు పోరాడాలి

మద్ది కాయల ఓంకార్‌ వర్ధంతి సభలో ఎంసీపీఐ(యు) నేతలు.

ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు పోరాడాలి

 బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా: ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ విలువల పరిరక్షణకు వామపక్ష శక్తులు ఐక్యంగా పోరాడాలని ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ అన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ 18వ వర్ధంతి సందర్భంగా శనివారం బెల్లంపల్లిలోని ఆయన స్మారక స్థూపం వద్ద పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎంసీపీఐ(యు) జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ అధ్యక్షతన ‘ప్రజాస్వామ్య హక్కులు–నియంతృత్వ ధోరణులు–వామపక్షాల కర్తవ్యం’ అనే అంశంపై సభ నిర్వహించారు. రాజేంద్రప్రసాద్, వెంకటేష్ మాట్లాడుతూ దేశంలో ఆకలి, నిరుద్యోగం, పేదరికం, కుల–మత వివక్ష వంటి సమస్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.మార్క్సిజం, అంబేద్కర్ ఆలోచనా విధానాల ఆధారంగా సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ఎంసీపీఐ(యు) పోరాడుతుందని తెలిపారు. కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ శ్రామిక, బహుజన వర్గాల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆరెపల్లి రమేష్, మండల కార్యదర్శి సతీష్, మహిళా నాయకులు కాంపల్లి రాధ, దుర్గం లక్ష్మి, కామెర పద్మతో పాటు యువజన, విద్యార్థి నాయకులు నరేష్, శేఖర్, సాయి, రామ్, మహేష్, ఆకాష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ
నిజామాబాద్, అక్టోబర్ 17 :(విజన్ ఆంధ్ర )ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో జిల్లా వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఎక్కడ కూడా...
నాగర్ కర్నూల్ జిల్లాలో BJYM ఆధ్వర్యంలో నిరసన యూత్ డిక్లరేషన్ హామీల అమలు చేయాలని డిమాండ్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి  జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ 
కోహెడలో అసలేం జరుగుతోంది? వారసంత లేని రోజున తైబజార్ వసూళ్లకు ఎవరు అనుమతిచ్చారు?
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
కరువు ముప్పు నివారణకై  కళాజాత  అవగాహన
నూజివీడు సీడ్స్ వారి ఆద్య పత్తి తో అధిక దిగుబడి ---- రీజనల్ మ్యానేజర్ శ్రీకాంత్ రెడ్డి