సరస్వతి దేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
శ్రీశ్రీ శంకరానంద స్వామి ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరభ్యాసం
సంన్ నారాయణపురం:యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని అన్నపూర్ణేశ్వరి ఆశ్రమంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆశ్రమ నిర్వాహకులు శ్రీ శంకరానంద స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా, ఉత్సవాల్లో అమ్మవారు భక్తులకు సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు.తెల్లవారుజాము నుంచే ఆశ్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు, విద్యార్థులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్ఞానప్రదాయిని అయిన సరస్వతి దేవి రూపంలో కొలువైన అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందదాయకమని భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు, విద్యార్థులకు బీజా అక్షరాలు, ప్రత్యేక పూజలు,వేడుకలు నిర్వహించారు.. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, భక్తులు,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


