పెద్ద మల్లారెడ్డి లో వ్యక్తి ఆత్మహత్య
భిక్కనూర్ :భిక్కనూర్ మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన మట్టి రాజు (30), తండ్రి దేవయ్య, కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి సుమారు 18 సంవత్సరాల క్రితం దోమకొండ మండలానికి చెందిన సబితతో వివాహం జరిగింది. వీరికి విక్కీ (15) అనే కుమారుడు ఉన్నాడు.గత నాలుగు సంవత్సరాల క్రితం కుటుంబ కలహాల నేపథ్యంలో అతని భార్య సబిత తన కుమారుడితో కలిసి పుట్టింటికి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ విషయమై పలుమార్లు కుల పెద్దల సమక్షంలో పంచాయతీలు నిర్వహించినప్పటికీ, ఆమె తిరిగి రాకపోవడంతో రాజు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది.తేదీ 15.10.2026 అర్ధరాత్రి సమయంలో రాజు తన ఇంటి పక్కన ఉన్న వేప చెట్టుకు ప్లాస్టిక్ తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న భి క్కనూర్ ఎస్ఐ,ఎస్. అనిల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి. ఎస్సై అని తెలిపారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


