నాగర్ కర్నూల్ పోలీస్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

 - ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ పాటిల్ బతుకమ్మ వేడుకలకు కుటుంబ సమేతంగా హాజరైన జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్

నాగర్ కర్నూల్ పోలీస్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మహిళా పోలీస్ సిబ్బంది రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. సంప్రదాయ బతుకమ్మ పాటలు, కోలాటాలతో వేడుకలు ఉత్సాహంగా సాగాయి. బతుకమ్మ చుట్టూ చేరి మహిళా పోలీస్ సిబ్బంది, అధికారులు ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు. ఇటువంటి వేడుకలతో పోలీస్ సిబ్బందిలో ఐక్యత, స్నేహభావం పెంపొందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు, డీఎస్పీలు పల్లె శ్రీనివాస్, బుర్రి శ్రీనివాస్, ఆర్‌ఐ జగన్, జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Views: 41

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ
నిజామాబాద్, అక్టోబర్ 17 :(విజన్ ఆంధ్ర )ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో జిల్లా వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఎక్కడ కూడా...
నాగర్ కర్నూల్ జిల్లాలో BJYM ఆధ్వర్యంలో నిరసన యూత్ డిక్లరేషన్ హామీల అమలు చేయాలని డిమాండ్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి  జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ 
కోహెడలో అసలేం జరుగుతోంది? వారసంత లేని రోజున తైబజార్ వసూళ్లకు ఎవరు అనుమతిచ్చారు?
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
కరువు ముప్పు నివారణకై  కళాజాత  అవగాహన
నూజివీడు సీడ్స్ వారి ఆద్య పత్తి తో అధిక దిగుబడి ---- రీజనల్ మ్యానేజర్ శ్రీకాంత్ రెడ్డి