పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి భరోసా: ఎమ్మెల్యే జిఎంఆర్
160 మంది లబ్ధిదారులకు రూ.1.60 కోట్ల చెక్కుల పంపిణీ
పటాన్చెరు :పేదింటి ఆడపిల్లల వివాహాలు తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా మారకూడదనే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.శనివారం పటాన్చెరు డివిజన్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, డివిజన్లకు చెందిన 160 మంది లబ్ధిదారులకు రూ.1,60,18,500 విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిఎంఆర్ మాట్లాడుతూ.. పేద కుటుంబాలు తమ ఆడపిల్లల వివాహాల కోసం అప్పులపాలు కాకుండా ఈ పథకాలు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ సహాయంతో పేద కుటుంబాలు తమ పిల్లల వివాహాలను సంతోషంగా నిర్వహించుకునే అవకాశం కలుగుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ఆయా మండలాల తహశీల్దార్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


