పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి: డీసీపీ
పోలీస్ స్టేషన్లో డీసీపీ ఆకస్మిక తనిఖీ
నల్లబెల్లి : పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, నాణ్యమైన దర్యాప్తుతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ శంఖ్వార్ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ రికార్డులు, క్రైమ్ రిజిస్టర్లు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిని పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సిబ్బందికి తెలిపారు.అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. నర్సంపేట ఏసీపీ పి. రవీందర్ రెడ్డి, దుగ్గొండి సీఐ శంకర్ రావు, నల్లబెల్లి ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


