నూజివీడు సీడ్స్ వారి ఆద్య పత్తి తో అధిక దిగుబడి ---- రీజనల్ మ్యానేజర్ శ్రీకాంత్ రెడ్డి
లక్షెట్టిపేట: నూజివీడు సీడ్స్ లిమిటెడ్ వారి ఆద్య పత్తి తో రైతులు అధిక దిగుబడులు పొందుతారు అని నూజివీడు కంపెనీ ప్రతినిధి రీజనల్ మ్యానేజర్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శనివారం మండలం లోని వెంకట్రావుపేట గ్రామం లోని బత్తుల సాయి కుమార్ ఆద్య పంట పైన మెగా క్షేత్ర ప్రదర్శనకు ముఖ్య అతిథిగా క్రాప్ మేనేజర్ ప్రకాష్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... మారుతున్న కాలానికి అనుగునంగా ఈ విత్తనం తయారుచేయడం జరిగిందని అన్నారు. ఈ విత్తనం తో రైతులకు అధిక దిగుబడి వస్తుందిని, పెద్ద కాయలు, గొలుసు కట్టు కాత, తక్కువ రోగాలు, ఆరోగ్య వంతమైన పంట, ఎక్కువ పూత, కాయలతో పంట వస్తుందిని తక్కువ పెట్టుబడి ఉంటుందని వివరించారు. గులాబీ రంగు పురుగు నుండి తప్పించుకుని తొందరగా పంట చేతికి వస్తుందని అన్నారు. ఆద్య విత్తనం అధిక దిగుబడినిచ్చే మేలైన రకం అని వివరించారు. అనంతరం ఇంతటి మంచి విత్తనం అందించిన నూజివీడు సీడ్స్ వారికి రైతులంతా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమానికి శ్రీరామ ఆగ్రో ఏజెన్సీస్ లక్షేటిపేట ప్రొప్రైటర్, నూజివీడు డిస్ట్రిబ్యూటర్ అప్పని ప్రశాంత్, కంపెనీ టెర్రిటరీ మ్యానేజర్ రాజబాబు, మార్కెట్ డెవలప్ మెంట్ ఆఫీసర్లు వేణుగోపాల్, మనోజ్ కుమార్ పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


