కరువు ముప్పు నివారణకై  కళాజాత  అవగాహన

కరువు ముప్పు నివారణకై  కళాజాత  అవగాహన

కాటారం ( భూపాలపల్లి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, డీపీఆర్ఓ శ్రీనివాస్ ఆదేశాల మేరకు, కాటారం మండలం కొత్తపల్లి గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో సెగ్గం శిరీష కళాబృందం సభ్యులు ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ మార్పులు, కరువు పరిస్థితులు, వ్యవసాయ రంగంపై వాటి ప్రభావం, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కళాజాత ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవడం, సాగులో ముందస్తు జాగ్రత్తలు పాటించడం, వ్యవసాయ నష్టాలను తగ్గించుకోవడం వంటి అంశాలపై కళాకారులు సందేశాన్ని అందించారు.ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం సాధారణ స్థాయిలో లేకపోవడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ ప్రణాళికలను రూపొందించుకోవాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని, పంట సాగుకు ముందే వర్షపాతం, నేల స్వభావం, నీటి లభ్యత వంటి అంశాలను పరిశీలించాలని వివరించారు. ఆరుతడి పంటల సాగుతో కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు తమ ప్రాంతానికి అనుకూలమైన ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని కళాబృందం సభ్యులు సూచించారు.ఈ అవగాహన కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి సెగ్గం శిరీష కళాబృందం సభ్యులు సెగ్గం శిరీష, పులి రాధిక, కాస స్వాతి, ఆత్మకూరి మహేందర్, కమ్మల ప్రవీణ్ కుమార్, ఒనపాకల కుమార్, పాల్గొని కళాజాత ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రజల ఆరోగ్యం, రైతుల సంక్షేమం, కరువు పరిస్థితులపై ముందస్తు అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కళాజాత కార్యక్రమం ద్వారా కొత్తపల్లి గ్రామ ప్రజలకు ఎల్‌నినో ప్రభావం, వ్యవసాయ జాగ్రత్తలు, ఆరుతడి పంటల సాగు ప్రాధాన్యతపై సందేశాన్ని అందించారు.

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ
నిజామాబాద్, అక్టోబర్ 17 :(విజన్ ఆంధ్ర )ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో జిల్లా వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఎక్కడ కూడా...
నాగర్ కర్నూల్ జిల్లాలో BJYM ఆధ్వర్యంలో నిరసన యూత్ డిక్లరేషన్ హామీల అమలు చేయాలని డిమాండ్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి  జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ 
కోహెడలో అసలేం జరుగుతోంది? వారసంత లేని రోజున తైబజార్ వసూళ్లకు ఎవరు అనుమతిచ్చారు?
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
కరువు ముప్పు నివారణకై  కళాజాత  అవగాహన
నూజివీడు సీడ్స్ వారి ఆద్య పత్తి తో అధిక దిగుబడి ---- రీజనల్ మ్యానేజర్ శ్రీకాంత్ రెడ్డి