మూడోసారి ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడిగా గణపతి నాయక్

చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా గణపతి నాయక్ మూడోసారి నియమితులయ్యారు. పార్టీ అధిష్ఠానం సూచనలు, నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన అనుబంధ విభాగాల నియామకాల్లో భాగంగా ఆయనకు మరోసారి ఈ బాధ్యతలు అప్పగించారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు, చౌటకూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోడపట్ల గణేష్ ఆధ్వర్యంలో పార్టీ అనుబంధ విభాగాలకు నూతన నియామకాలు చేపట్టారు. ఈ క్రమంలో ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడిగా గణపతి నాయక్‌ను మూడోసారి నియమించారు. ఆయనకు మరోసారి బాధ్యతలు అప్పగించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గణపతి నాయక్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి మూడోసారి ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన మంత్రి దామోదర రాజనర్సింహకు, చౌటకూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోడపట్ల గణేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన పార్టీ సీనియర్ నాయకులు సుభాష్ రెడ్డి, మల్లారెడ్డితో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని, పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని గణపతి నాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ సుభాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


