బి.పి., షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు - నవంబర్ 1న నాగర్ కర్నూల్ లో వైద్య శిబిరం: డా. మణికంఠ జగదీష్
నాగర్ కర్నూల్ : బి.పి., షుగర్ వ్యాధిగ్రస్తులకు నవంబర్ 1న ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు శ్రీ మణికంఠ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు డా. మణికంఠ జగదీష్ తెలిపారు. పట్టణంలోని రాంనగర్ కాలనీ, పుల్లారెడ్డి హాస్పిటల్ రోడ్డులోని తమ ఆసుపత్రిలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ శిబిరంలో బి.పి., షుగర్ వ్యాధిగ్రస్తులకు ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ షుగర్ రక్త పరీక్షలు, రక్తపోటు, మూత్ర, రక్త పరీక్షలతో పాటు సాధారణ ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా మద్యపానం, ధూమపానం అలవాటు ఉన్నవారు, ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వివరాలకు 9885880155, 9885880166 నంబర్లను సంప్రదించాలని కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


