భూ రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామ పరిధిలో రీ సర్వే పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్

భూ రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

పెద్దకొత్తపల్లి (నాగర్ కర్నూల్) భూ రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామ పరిధిలోని పోచాపూర్ శివారులో శుక్రవారం జరుగుతున్న భూ రీ సర్వే పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాతాపూర్ గ్రామ పరిధిలో మొత్తం 544 ఎకరాల భూమి విస్తీర్ణం ఉండగా, ఇప్పటివరకు 120 ఎకరాల భూమికి రీ సర్వే పూర్తి చేసినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. మిగిలిన భూములకు ప్రణాళికాబద్ధంగా రీ సర్వే చేపట్టాలని సూచించారు. భూముల హద్దులు, విస్తీర్ణం, యాజమాన్య వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని, వారసత్వ బదిలీ (విరాసత్) విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పారదర్శకత పాటిస్తూ నిర్ణీత గడువులో, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిబంధనల ప్రకారం సర్వే చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏడి సర్వేయర్ గిరిధర్, కొల్లాపూర్ ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఉప సర్పంచ్ బాలీశ్వరమ్మ, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ.
  బాన్సువాడ :  ప్రధానమంత్రి కిసాన్ నిధులను శుక్రవారం విడుదల చేసిన మోడీ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ   గుజరాత్ లో ప్రధాన మంత్రి కిసాన్ ఉత్సవ
బి.పి., షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు - నవంబర్ 1న నాగర్ కర్నూల్ లో వైద్య శిబిరం: డా. మణికంఠ జగదీష్
షంషీర్ నగర్ స్మశాన వాటికలో అక్రమ షెడ్డు తొలగింపు
పోచమ్మ ఆలయ గద్దెల కూల్చివేతపై బస్తీవాసుల ఆగ్రహం!
రాళ్లతో దాడి బాధితుడికి న్యాయం చేయాలి
భూ రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెద్దకొత్తపల్లి మండలం చెన్నాపురావుపల్లిలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్