అర్ధరాత్రి వేళ క్షేత్రస్థాయిలోకి సీపీ అంబర్ కిషోర్ ఝా

అర్ధరాత్రి వేళ క్షేత్రస్థాయిలోకి               సీపీ అంబర్ కిషోర్ ఝా

మంచిర్యాల : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల పట్టణంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అర్ధరాత్రి వేళ బైక్‌పై క్షేత్రస్థాయి పెట్రోలింగ్ నిర్వహించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేపడుతున్న చర్యలను స్వయంగా పరిశీలించారు.రాత్రి వేళల్లో పట్టణ శివారు ప్రాంతాల్లో పోలీసుల నిఘా, పెట్రోకార్, బ్లూకోల్ట్స్ సిబ్బంది పనితీరును సీపీ సమీక్షించారు. విధుల నిర్వహణలో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ప్రజలకు భద్రతా భావం కల్పించేలా నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు,వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.సీపీ అంబర్ కిషోర్ ఝా వెంట మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోదరావు, రూరల్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ తదితరులు ఉన్నారు. 

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అర్ధరాత్రి వేళ క్షేత్రస్థాయిలోకి               సీపీ అంబర్ కిషోర్ ఝా అర్ధరాత్రి వేళ క్షేత్రస్థాయిలోకి సీపీ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాల : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల పట్టణంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అర్ధరాత్రి వేళ బైక్‌పై క్షేత్రస్థాయి పెట్రోలింగ్ నిర్వహించారు....
చౌటకూర్ మండలంలో ఐదు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న కూలీలకు 11కెవి వైర్లు తగిలి నలుగురు కూలీలకు తీవ్ర గాయాలు
రాణిపేట సెయింట్ మేరీ పాఠశాలలో ఎంఈఓ ఆకస్మిక తనిఖీ
నాగారంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై కాంగ్రెస్ విస్తృత ప్రచారంe
మారుమూల ఆదివాసీ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
సెయింట్ జోసఫ్ పాఠశాలలో విద్యార్థులకు న్యాయ సేవల కమిటీ ఆధ్వర్యంలో ఫోక్స చట్టంపై అవగాహన