బిజినపల్లిలో అట్టహాసంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

బిజినపల్లిలో అట్టహాసంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

బిజినపల్లి (నాగర్ కర్నూల్) : నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మిద్దె రాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మిద్దె రాములు మాట్లాడుతూ, సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎదిగి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడని అన్నారు. ఆయన నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ సంక్షేమం, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకుపోతోందని కొనియాడారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ పథకాల ద్వారా అర్హులకు లబ్ధి చేకూర్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఉండి తెలంగాణను అభివృద్ధి పథంలో నడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మాన్య నాయక్, చంద్ర గౌడ్, ఎండి నజీర్, గడ్డమీది మహేష్, కదిరే రాము, గంగనమోని మల్లేష్, బాలపిరు, కతే ఈశ్వర్, గోవిందు నాయక్, మిద్దె సురేష్, పోలేపల్లి మహేందర్, అమృత్ రెడ్డి, పర్వతాలు, గోవిందు శేఖర్, రామన్ గౌడ్, పండ్లపాష, ఎండి ముక్తార్ తదితర మండల, గ్రామ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ
భువనగిరి :  రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.. స్వాగతం
హెచ్ఐవి నియంత్రణలో జిల్లాకు సురక్షిత గుర్తింపు
ఆధ్యాత్మికతతో శాంతిని నెలకోల్పాలి
59వ గ్రంథాలయ వారోత్సవాల్లో బిట్స్ జయకేతనం
మద్యం మత్తులో పొలంలో పడి వ్యక్తి మృతి
జీవితభీమా పధకానికి నమోదు చేసుకోవాలి