కోహెడ బాడుగుల చెరువులో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు సెంటర్లో పందుల బీభత్సం
పందుల బీభత్వాన్ని అరికట్టాలని అధికారులకు రైతుల వినతి
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బాడుగుల చెరువు వద్ద ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుకోలు సెంటర్ లో రైతులు ఆరబోసిన వడ్లను, కల్లాలను నాశనం చేస్తూ పందులు స్వైర విహారం చేస్తున్నాయి.దీంతో ఆరబోసిన రైతులు ఆరబోసిన వడ్ల వద్ద పందుల స్వైర విహారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పందులు తిరిగే చోట ఐకెపి సెంటర్ ఆధ్వర్యంలో వడ్లు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారని అధికారులు పట్టించుకోవడంలేదని ఆరబోసిన వడ్లను, కల్లాలను నాశనం చేస్తున్నాయని రైతులు తీవ్రంగా అధికారులపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ఆరబోసిన వడ్లను, కల్లాలను నాశనం చేస్తూ స్వైర విహారం చేస్తున్న పందులను అరికట్టాలని అధికారులు చర్యలు తీసుకోవాలని రైతుల ఇబ్బందులను తొలగించాలని అధికారులను వేడుకుంటున్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


