ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని కేఆర్‌కే కాలనీ వృద్ధాశ్రమంలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు*

వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి, వారితో కలిసి కేక్ కట్ చేసిన డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని కేఆర్‌కే కాలనీ వృద్ధాశ్రమంలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు*

ఆదిలాబాద్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 57వ జన్మదినాన్ని పురస్కరించుకొని  ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కేఆర్‌కే కాలనీలో ఉన్న వృద్ధాశ్రమంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి పండ్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు  నరేష్ జాదవ్  మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రజల మధ్య నుంచి ఎదిగిన నాయకుడని, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. పేదలు, బలహీన వర్గాలు, మహిళలు, రైతులు, వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి  జన్మదినాన్ని పురస్కరించుకొని వృద్ధాశ్రమంలోని పెద్దల మధ్య వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని, వృద్ధుల ఆశీస్సులు, ఆప్యాయతలు సమాజానికి ఎంతో విలువైనవని తెలిపారు. వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవం, ప్రేమ, బాధ్యతతో వ్యవహరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో , మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ,మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఆదిలాబాద్ ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ
భువనగిరి :  రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.. స్వాగతం
హెచ్ఐవి నియంత్రణలో జిల్లాకు సురక్షిత గుర్తింపు
ఆధ్యాత్మికతతో శాంతిని నెలకోల్పాలి
59వ గ్రంథాలయ వారోత్సవాల్లో బిట్స్ జయకేతనం
మద్యం మత్తులో పొలంలో పడి వ్యక్తి మృతి
జీవితభీమా పధకానికి నమోదు చేసుకోవాలి