గుస్సాడి, దండారీ వేడుకల్లో పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఏ ఎం సి చైర్మన్ బోరంచు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా గుస్సాడి కళాకారులతో కేక్ కట్ చేసి సంబరాలు
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన గుస్సాడి, దండారీ వేడుకల్లో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న డాక్టర్ నరేష్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి,ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో గుస్సాడి కళాకారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నాయకులను శాలువాలతో సత్కరించారు. గుస్సాడి, దండారీ సంప్రదాయ నృత్యాలను తిలకించిన నాయకులు కళాకారులను, గ్రామస్తులను ఉత్సాహపరిచారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని గుస్సాడి కళాకారులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ సోయం బాపురావు, ఏ ఎం సి చైర్మన్ బోరంచులు మాట్లాడుతూ... గుస్సాడి, దండారీ నృత్యాలు ఆదివాసీల ప్రత్యేక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని అన్నారు. తరతరాలుగా వస్తున్న ఆదివాసీ ఆచారాలు, సంప్రదాయాలు, కళలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఆదివాసీ యువత విద్యపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గుస్సాడి, దండారీ వేడుకలు నిర్వహించుకునేందుకు అవసరమైన షెడ్ల నిర్మాణంతో పాటు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ఆదివాసీ కళలు, సంస్కృతికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఆదివాసీ కళాకారులను ప్రోత్సహిస్తూ వారి సంప్రదాయాలకు తగిన గుర్తింపు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవీందర్, మాజీ ఎంపీ సోయం బాపురావు, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, మండల అధ్యక్షులు సుదర్శన్, హన్ను పటేల్, సర్పంచులు కామన్వార్ అశోక్ , దాసరి రమేష్, తానాజీ, మోహన్ రావు, కౌడల నారాయణ, రాజారెడ్డి , వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


