పందిల్ల టోల్గేట్ వద్ద ప్రమాదం,తప్పిన ప్రాణనష్టం
అసంపూర్తి పనులపై ప్రయాణికుల ఆందోళన
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న టోల్గేట్ సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ రోడ్డు గుంతలమయంగా ఉండటంతో అటుగా వెళ్తున్న స్విఫ్ట్ కారు ప్రమాదానికి గురైంది. కారులో ప్రయాణిస్తున్న దంపతులకు స్వల్ప గాయాలు కాగా, ప్రాణాపాయం తప్పింది. కారు తీవ్రంగా దెబ్బతింది.ఈ సందర్బంగా టోల్గేట్ నిర్మాణ పనులు అధికారుల నిర్లక్ష్యంతొ పూర్తికాకపోవడం,రోడ్డుపై గుంతలు ఉండటం, హెచ్చరిక బోర్డులు సరిగా ఏర్పాటు చేయకపోవడం ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు,వాహనదారులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని, నిర్మాణ పనుల వద్ద భద్రతా చర్యలు తీసుకోవాలని, ప్రమాదలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


