ఐటీ టవర్ నుంచి బట్టి సావర్గావ్ గ్రామం వరకు రెండు కిలోమీటర్ల బీటీ రోడ్డు మంజూరు చేయించాలని డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్‌ను కోరిన గ్రామస్తులు itle

ఐటీ టవర్ నుంచి బట్టి సావర్గావ్ గ్రామం వరకు రెండు కిలోమీటర్ల బీటీ రోడ్డు మంజూరు చేయించాలని డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్‌ను  కోరిన గ్రామస్తులు itle

ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఐటీ టవర్‌కు అనుసంధానంగా బట్టి సావర్గావ్ గ్రామం నుంచి దుబ్బగూడ మోడల్ కాలనీ మీదుగా వెళ్లే మట్టి రహదారిని బీటీ రోడ్డుగా అభివృద్ధి చేయాలని కోరుతూ బట్టి సావర్గావ్ గ్రామస్తులు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ ను  ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, బట్టి సావర్గావ్ గ్రామం నుంచి దుబ్బగూడ మోడల్ కాలనీ మీదుగా ఐటీ టవర్‌కు వెళ్లే రహదారి ప్రస్తుతం మట్టి రహదారిగా ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో రహదారి బురదమయంగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని వివరించారు.
ఐటీ టవర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ మార్గంలో రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున, సుమారు రెండు కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారిని బీటీ రోడ్డుగా నిర్మించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయించాలని కోరుతూ  నరేష్ జాదవ్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్  స్పందిస్తూ, గ్రామస్తులు ఎదుర్కొంటున్న రహదారి సమస్యను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, బీటీ రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరయ్యేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, ప్రజల మౌలిక సదుపాయాల కల్పన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బట్టి సావర్గావ్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తో పాటు నల్ల గణపతి రెడ్డి, వెంకట్ రెడ్డి, తడిసిన వెంకట్ రెడ్డి, లోగిటి శ్రీనివాస్, కోరటి ప్రభాకర్, అన్నం సెంటన్న, దొంతుల వెంకటేష్, దర్శనాల ప్రవీణ్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం
కొత్తగూడెం బ్యూరో : డిజిటల్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఇతరులతో పంచుకోవద్దని కొత్తగూడెం సబ్ ఇన్‌స్పెక్టర్ జుబేదా...
దీపావళి వేడుకల్లో తగు జాగ్రత్తలు పాటించాలి: యువత, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలి – పుల్కల్ ఎస్ఐ విశ్వజన్
డీఈవో చేతుల మీదుగా బహుమతులు అందుకున్న సిద్ధార్థ విద్యార్థులు
మోడల్ స్కూల్ లో పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం
మునుగోడులో ఘనంగా సుంకరి బిక్షం గౌడ్ విరమణ వేడుక.
చేగుంట బస్టాండ్ దుస్థితి మార్చే వారే లేరా
ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వెలుగులు నింపాలి