అభివృద్ధిపై విమర్శలు కాదు.. సహకరించండి

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు సూటి ప్రశ్నలు

అభివృద్ధిపై విమర్శలు కాదు.. సహకరించండి

కూకట్‌ పల్లి :  కూకట్‌పల్లి నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై రాజకీయ విమర్శలకు బదులు నిర్మాణాత్మకంగా సహకరించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును కోరుతూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. గత పదేళ్లలో అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.కూకట్‌పల్లి మెట్రో పార్కులో యువత కోసం స్టేడియం నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదన గత పదేళ్లలో ఎందుకు కార్యరూపం దాల్చలేదని ప్రశ్నించారు. అలాగే కేపీహెచ్‌బీ–జేఎన్‌టీయూ రోడ్డులో పెట్రోల్ బంక్ ఏర్పాటు అంశంపై గతంలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించాలని కోరారు.రమ్య గ్రౌండ్ సమీపంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరుతో పాఠశాల నిర్మాణానికి సంబంధించి గతంలో వచ్చిన ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాఠశాల నిర్మాణం కోసం నిధుల సేకరణ జరిగి ఉంటే వాటి వివరాలను ప్రజల ముందు ఉంచాలని కోరారు.హైదరాబాద్‌లో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు అద్దె భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, వారికి సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఎల్ఐజీ, ఎంఐజీ గృహాల నిర్మాణ ప్రతిపాదనను స్వాగతించాలని పేర్కొన్నారు. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, నిధులు, అమలు విధానంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కూడా కోరారు.ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల విశ్వాసాన్ని పొందారని, తన రాజకీయ అనుభవాన్ని కూకట్‌పల్లి అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. ప్రజా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించి, నియోజకవర్గ ప్రగతిలో భాగస్వామి కావాలని కోరారు.రాజకీయ ఆరోపణల కంటే ప్రజల అభివృద్ధి ముఖ్యమని, కూకట్‌పల్లి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, నిరుపేదలకు సొంత ఇళ్లు, యువతకు మెరుగైన అవకాశాలు అందించేందుకు అందరూ కలిసి పనిచేయాలని పత్రికా ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం
కొత్తగూడెం బ్యూరో : డిజిటల్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఇతరులతో పంచుకోవద్దని కొత్తగూడెం సబ్ ఇన్‌స్పెక్టర్ జుబేదా...
దీపావళి వేడుకల్లో తగు జాగ్రత్తలు పాటించాలి: యువత, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలి – పుల్కల్ ఎస్ఐ విశ్వజన్
డీఈవో చేతుల మీదుగా బహుమతులు అందుకున్న సిద్ధార్థ విద్యార్థులు
మోడల్ స్కూల్ లో పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం
మునుగోడులో ఘనంగా సుంకరి బిక్షం గౌడ్ విరమణ వేడుక.
చేగుంట బస్టాండ్ దుస్థితి మార్చే వారే లేరా
ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వెలుగులు నింపాలి