గుస్సాడి, దండారీ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్లే రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు , ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్.
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని దొంగర్ గావ్ గ్రామంలో నిర్వహించిన గుస్సాడి, దండారీ వేడుకల్లో మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్లే, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ మ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న నాయకులకు ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో గుస్సాడి లు ఘన స్వాగతం పలికి అతిధులకు శాలువాతో సన్మానించారు. గుస్సాడి, దండారీ నృత్యాలను తిలకిస్తూ కళాకారులను, గ్రామస్తులను ఉత్సాహపరిచారు.ఈ సందర్భంగా సోయం బాపూరావు గారు మాట్లాడుతూ గుస్సాడి, దండారీ నృత్యాలు ఆదివాసీల ప్రత్యేక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని అన్నారు. తరతరాలుగా వస్తున్న ఆదివాసీ ఆచారాలు, సంప్రదాయాలు, కళలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.అలాగే ఆదివాసీ యువత చదువులపై దృష్టి సారించి ఉన్నత ఉద్యోగాలు సాదించాలన్నారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం సాగిగా లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని అలాగే నెట్ వర్క్ సమస్యను తీర్చడానికి తనవంతు కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గుస్సాడి, దండారీ వేడుకలు నిర్వహించుకునేందుకు అవసరమైన షెడ్ల నిర్మాణంతో పాటు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ఆదివాసీ కళలు, సంస్కృతికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఆదివాసీ కళాకారులను ప్రోత్సహిస్తూ వారి సంప్రదాయాలకు తగిన గుర్తింపు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ పెందూర్ బాదు పటేల్, మహాజన్ అర్కా సెడమా రావు, దేవరీ పెందూర్ భీం రావు, సర్పంచ్ విమల బాయి, ఉప సర్పంచ్ సీత భాయి, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్సంగ్ తానాజీ, కనక తులసిరామ్, మోహన్ రావు, రాజ్ గోండ్ సేవ సమితి ఇంద్రవెల్లి అధ్యక్షులు గణేష్, విశాల్, గ్రామ పెద్దలు, ఆదివాసీ మహిళలు, యువత, గుస్సాడి, దండారీ కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


