రామన్ హైస్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

హన్మకొండ : హనుమకొండలోని రామన్ హైస్కూల్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు, ఆటపాటలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎర్రబెల్లి స్వర్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. పూలను పూజిస్తూ ప్రకృతిని గౌరవించే ఈ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెబుతుందని అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.పాఠశాల కరస్పాండెంట్ ఆర్. రాజేష్ కుమార్, డైరెక్టర్ పురుషోత్తం ఆధ్వర్యంలో నిర్వహించారు.
విద్యార్థులు సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆడుతూ పండుగ విశిష్టతను చాటిచెప్పారు. తెలంగాణ సంస్కృతికి వారసులుగా భావితరాలను తీర్చిదిద్దడంలో విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకమని నిర్వాహకులు పేర్కొన్నారు. విద్యార్థులకు మన పండుగల ప్రాముఖ్యతను తెలియజేస్తూ, సాంస్కృతిక విలువలను అలవర్చడమే ఇటువంటి వేడుకల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఉత్సాహభరిత వాతావరణంలో బతుకమ్మ సంబరాలు ముగిశాయి.ఈ వేడుకల్లో ప్రిన్సిపాల్స్ స్రవంతి, చంద్రప్రకాష్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

