పండగపూట పట్టణంలో విషాదం..!

ఎదురు ఎదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీ, వేములవాడ యువకుడు మృతి.
బోయినిపల్లి (రాజన్సిన రిసిల్ల) : బోయినిపల్లి మండలం కొదురుపాక బ్రిడ్జి వద్ద రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.ఈ ఘటనలో వేములవాడ పట్టణానికి చెందిన నాగుల శేఖర్ అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి,మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


