కరెంట్ షాక్ తో విద్యార్థికి గాయాలు

గండీడ్ (రాజన్న సిరిసిల్ల) : గండీడ్ మండల పరిధిలోని వెన్నచెడ్ గ్రామంలో శనివారం అయిదవ వార్డులోని కావలి వెంకటయ్య ఇంటి పైన కరెంటు వైర్లు చాలా కిందికి ఉండడంతో వెంకటయ్య కుమారునికీ శ్రీశైలానికి ఇంటిపై ఆడుకుంటుంటే ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలింది. గ్రామంలో ఇళ్లపైన కరెంటు వైర్లు ప్రమాదాలకు దగ్గరలో ఉన్నటువంటి వైర్లను గుర్తించి సమస్యను పరిష్కరించగలరని వారం రోజుల కిందనే విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులకు తెలియజేయడం జరిగింది ఇట్టి సమస్యను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. గ్రామంలో జరిగిన కరెంట్ షాక్ విషయాన్ని గ్రామ సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య గారు స్పందించి వారం రోజుల క్రిందనే మన గ్రామానికి విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు వచ్చి సమస్యలు తెలుసుకుని ఆదర్శ గ్రామంగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


