నాగ సముద్రాల పియంశ్రీ పథకం ద్వారా వచ్చిన పాఠశాల రెండు కోట్ల నిధులపై విచారణ జరిపి నిగ్గుతెల్చాలి
తల్లిదండ్రుల సమావేశాల ఖర్చులు, పాత రికార్డుల అప్పగింతపై సమగ్ర విచారణ చేపట్టాలి

సిద్దిపేట జిల్లా బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వెంకటేశం డిమాండ్
- PM శ్రీ నిధుల బాగోతం నిగ్గు తేల్చేందుకు విద్యావతుడైన గుగ్లోత్ శేఖర్ నాయక్ RTI వేసి పోరాటం
- నాగసముద్రాల తెలంగాణ మోడల్ స్కూల్‌లో సమాచార హక్కు చట్టం ఉల్లంఘనపై విచారణ జరపాలి
హుస్నాబాద్ (సిద్ధిపేట) : పీఎంశ్రీ పథకం ద్వారా 2023 లో సుమారు 2.కోట్ల రూపాయలు సిద్దిపేట జిల్లా కోహెడ మండలంనాగ సముద్రాల మాడల్ స్కూల్ అభివృద్ధికి ఖర్చు చేయాలని నిధులు విడుదల చేశారు . కాని పేరెన్స్ మీటింగ్ జరిగితే సింగిల్ టి తెలియదు కాని లెక్కల్లో మాత్రం వెల కొద్ది ఖర్చు చేసినట్లు లెక్కలు? టూర్ కెళ్లింది ఓక బస్సు అయితే లెక్కల్లో ఏడెనిమిది బస్సుల లెక్కలు ఉన్నట్టు అనుమానాలు? ఇలా లెక్కలులేని నిధుల ఖర్చులో మర్మమేమిటో? గోప్యమేమిటో? సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నాగసముద్రాల తెలంగాణ మోడల్ స్కూల్‌లో సమాచార హక్కు చట్టం (RTI) కింద కోరిన సమాచారాన్ని అందించడంలో జాప్యం, సమాచార కాపీలకు అధిక రుసుము కోరడం, పాత రికార్డుల అప్పగింతలో లోపాలు, తల్లిదండ్రుల సమావేశాల ఖర్చులపై వస్తున్న ఆరోపణలపై జిల్లా విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ జరపాలని బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం డిమాండ్ చేశారు.
RTI రుసుముల వసూలుపై స్పష్టత ఇవ్వాలి
నాగసముద్రాల తెలంగాణ మోడల్ స్కూల్‌కు సంబంధించిన నిధులు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారాన్ని కోరుతూ 22-08-2026న సమాచార హక్కు చట్టం కింద గుగ్లోత్ శేఖర్ నాయక్ దరఖాస్తు చేసినట్లు తెలిపారు. సుమారు 1,800 పేజీల సమాచారానికి పేజీకి రూ.3 చొప్పున మొత్తం రూ.5,400 పాఠశాల ప్రైవేట్ ఖాతాలో జమ చేయాలని 22-09-2026న ప్రిన్సిపాల్ లేఖ ఇచ్చినట్లు పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం కింద వర్తించే రుసుముల నిబంధనలు, తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO Ms. No.454, తేదీ 28-10-2013 ప్రకారం వసూలు చేసిన రుసుము, చెల్లింపు విధానం నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుము కోరినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
గడువులోగా సమాచారం ఇవ్వకపోతే ఉచితంగా అందించాలి
RTI దరఖాస్తుకు చట్టబద్ధమైన గడువులోగా సమాచారం అందించలేదని, ఈ నేపథ్యంలో సెక్షన్ 7(6) ప్రకారం సమాచారం ఉచితంగా అందించాల్సిన అంశాన్ని అధికారులు పరిశీలించాలని ఖమ్మం వేంకటేశం అన్నారు. ఈ విషయంపై 26-09-2026న జిల్లా విద్యాశాఖ అధికారి (DEO), సిద్దిపేటకు మొదటి అప్పీల్ చేసినప్పటికీ సమాధానం అందలేదని దరఖాస్తుదారు పేర్కొంటున్నారని తెలిపారు. అప్పీల్‌పై కూడా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
పాత రికార్డుల అప్పగింతపై విచారణ జరపాలి
పాఠశాల కొత్త ప్రిన్సిపాల్ జిల్లా విద్యాశాఖ అధికారికి రాసిన లేఖలో పాత ప్రిన్సిపాల్ నుంచి బిల్లులు, వోచర్లు, స్టాక్ రిజిస్టర్లు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం (MDM)కు సంబంధించిన రికార్డులు అందలేదని పేర్కొన్నట్లు సమాచారం ఉందన్నారు. ఈ రికార్డులు ఎందుకు అప్పగించలేదు? వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? పాఠశాల నిధుల ఖర్చులకు సంబంధించిన ఆధారాలు సక్రమంగా ఉన్నాయా? అనే అంశాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
పేరెంట్స్ మీటింగ్ ఖర్చులపై ఆడిట్ చేయాలి
తల్లిదండ్రుల సమావేశాల్లో టీ, స్నాక్స్ అందించకుండానే వాటికి ఖర్చు చేసినట్లు బిల్లులు చూపించి నిధులు డ్రా చేశారనే ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. ఈ ఆరోపణల నిజానిజాలను నిర్ధారించేందుకు సంబంధిత బిల్లులు, వోచర్లు, హాజరు వివరాలు, బ్యాంకు లావాదేవీలను పరిశీలించి, అవసరమైతే 2023 నుంచి 2026 వరకు పాఠశాల ఖాతాలపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని కోరారు.
జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించాలి
ఈ వ్యవహారంపై DEO సిద్దిపేట తక్షణమే విచారణ చేపట్టి, పాఠశాల నిధుల వినియోగం, రికార్డుల నిర్వహణ, RTI దరఖాస్తుల పరిష్కారం వంటి అంశాలపై నిజానిజాలను వెలికితీయాలని ఖమ్మం వేంకటేశం డిమాండ్ చేశారు ఆరోపణలు విచారణలో నిజమని తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, కోరిన సమాచారాన్ని నిబంధనల ప్రకారం అందించాలని అన్నారు.అధికారులు స్పందించని పక్షంలో తదుపరి అప్పీల్‌తో పాటు సంబంధిత విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు దీనిపై బిజెపి నేతృత్వంలో పోరాటాలకు వెనకడబోమని ఖమ్మం వేంకటేశం అన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


