- వేటగాళ్ల ఉచ్చుకు రైతు మృతి, మాయమైన మృతదేహం..!

WhatsApp Image 2026-10-10 at 7.47.33 AM

అజాంనగర్ అటవీ ప్రాంతంలో దారుణం..!!

- అటవీ ప్రాంతంలో అమర్చిన విద్యుత్‌ తీగలే ప్రాణం తీశాయా.?
- ట్రాక్టర్‌ డ్రైవర్లు తిరిగొచ్చేసరికి మృతదేహం అదృశ్యం..! 
- గ్రామంలో కలకలం..

భూపాలపల్లి : భూపాలపల్లి  మండలం అజాంనగర్ అటవీ ప్రాంతంలో దారుణం జరిగింది. అడవిలో పోడు భూమి సాగు కోసం రాత్రిపూట వెళ్లిన ఓ రైతు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు తెలిసింది. మృతదేహం కోసం అటు అటవీశాఖ సిబ్బంది, ఇటు గ్రామస్తులు అడవిలో జల్లెడ పడుతున్నారు. ఈ సంఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. అజంనగర్‌ గ్రామానికి చెందిన జడల అశోక్‌ (35) శుక్రవారం రాత్రి అజంనగర్‌–నిమ్మగూడెం మధ్యనున్న అటవీ ప్రాంతంలో పోడు భూమి సాగు కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వేటగాళ్లు వన్యప్రాణుల వేట కోసం అమర్చినట్లు భావిస్తున్న విద్యుత్‌ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం.

- మృతదేహం ఏమైంది?

అశోక్‌ విద్యుత్‌ తీగలకు గురై మృతి చెందిన ఘటనను గమనించిన ట్రాక్టర్‌ డ్రైవర్లు గ్రామానికి వెళ్లి గ్రామస్తులకు సమాచారం అందించినట్లు తెలిసింది. అయితే గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే మృతదేహం కనిపించకుండా పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో అసలు అక్కడ ఏం జరిగింది? మృతదేహం ఎక్కడికి వెళ్లింది? దానిని ఎవరైనా తరలించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరిణామం గ్రామస్తుల్లో ఆందోళనను మరింత పెంచింది.

- విద్యుత్‌ తీగలు అమర్చిందెవరు?

అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేట కోసం విద్యుత్‌ తీగలు అమర్చినట్లు వస్తున్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి తీగలు మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అశోక్‌ మృతికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? విద్యుత్‌ తీగలను ఎవరు అమర్చారు? మృతదేహం కనిపించకుండా పోవడానికి కారణమేంటి? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతదేహం ఆచూకీ, అధికారిక ధ్రువీకరణ ఇంకా తెలియాల్సి ఉంది.

 

Views: 208

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..! గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..!
జోగిపేట నుంచి మరో అంబులెన్స్‌ రప్పించిన పైలెట్ చౌటకూర్  (సంగారెడ్డి) : అత్యవసర సమయంలో గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్‌ మార్గమధ్యంలో మొరాయించింది.శనివారం మధ్యాహ్నం పుల్కల్‌...
టిపిటిఎఫ్ దంతాలపల్లి మండల శాఖ నూతన కమిటి ఎన్నిక
గొంగ్లూర్ లో బతుకమ్మ ఘాట్ ను ప్రారంభించిన సర్పంచ్
10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య  
- వేటగాళ్ల ఉచ్చుకు రైతు మృతి, మాయమైన మృతదేహం..!
నాగ సముద్రాల పియంశ్రీ పథకం ద్వారా వచ్చిన పాఠశాల రెండు కోట్ల నిధులపై విచారణ జరిపి నిగ్గుతెల్చాలి 
దసరా సెలవుల్లో ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్.