టిపిటిఎఫ్ దంతాలపల్లి మండల శాఖ నూతన కమిటి ఎన్నిక


WhatsApp Image 2026-10-10 at 8.33.05 AM

అధ్యక్షులుగా చింతల. సురేష్, ప్రధాన కార్యదర్శిగా జి.సంతోష్ కుమార్ ఎన్నిక

తొర్రూరు (డివిజన్) : తొర్రూర్ డివిజన్ దంతాలపల్లి మండలం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మండల శాఖ నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కార్యదర్శి తాళ్లూరి రవీందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిచింతల విష్ణువర్ధన్ రెడ్డి  ముఖ్య అతిథి గా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం పిఆర్సి కమిటీ రిపోర్టును వెంటనే తెప్పించుకొని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కమిటీ కాలపరిమితి దాటిన ప్రభుత్వం కాల యాపన చేస్తున్నదని  విమర్శించారు.  జిల్లా కార్యదర్శితాళ్లూరి రవీందర్ మాట్లాడుతూ, ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. అనంతరం,సమావేశంలోనూతనకమిటీని,ఎన్నుకున్నారు .ఈ కార్యక్రమానికి సహాయ ఎన్నికల అధికారిగా తండ ప్రభాకర్, ఎన్నికల పరిశీలకులుగా కొండం జనార్ధన్ హాజరై ఎన్నిక నిర్వహించారు. మండల అధ్యక్షులుగా చింతల సురేష్ , మండల ప్రధాన కార్యదర్శిగా జి సంతోష్కుమార్ ,ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా  డి నగేష్, పి పావని,  కార్యదర్శులుగా డి రవీంద్ర చారి, జి రమేష్, తమ్మి రమేష్,  జిల్లా  కౌన్సిలర్స్ కే. పద్మావతి, కే రామయ్య, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా జాలిగా మాధవి, సభ్యులుగా బానోతు విజయ్, ఏ ప్రియాంక అకాడమిక్ సెల్ కన్వీనర్ కూరపాటి.ఆంజనేయులు, సభ్యులు జి నాగమణి,  జీవోల కమిటీ కన్వీనర్ గా కీర్తి స్వప్న ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి  పి విష్ణువర్ధన్ రెడ్డి, తండ ప్రభాకర్, కే. జనార్ధన్ పరిశీలకులు  ప్రకటించారు.

 

 

Views: 29

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..! గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..!
జోగిపేట నుంచి మరో అంబులెన్స్‌ రప్పించిన పైలెట్ చౌటకూర్  (సంగారెడ్డి) : అత్యవసర సమయంలో గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్‌ మార్గమధ్యంలో మొరాయించింది.శనివారం మధ్యాహ్నం పుల్కల్‌...
టిపిటిఎఫ్ దంతాలపల్లి మండల శాఖ నూతన కమిటి ఎన్నిక
గొంగ్లూర్ లో బతుకమ్మ ఘాట్ ను ప్రారంభించిన సర్పంచ్
10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య  
- వేటగాళ్ల ఉచ్చుకు రైతు మృతి, మాయమైన మృతదేహం..!
నాగ సముద్రాల పియంశ్రీ పథకం ద్వారా వచ్చిన పాఠశాల రెండు కోట్ల నిధులపై విచారణ జరిపి నిగ్గుతెల్చాలి 
దసరా సెలవుల్లో ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్.