భీమేశ్వరుడిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్

WhatsApp Image 2026-10-10 at 3.30.32 AM

దసరా, సద్దుల బతుకమ్మ ఏర్పాట్లపై సమీక్ష.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచన

వేములవాడ బ్యూరో : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామిని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్, ఇన్‌చార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ హనుమంతరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కమిషనర్ దంపతులకు ఆలయ డీఈవో ప్రతాప నవీన్ కుమార్ పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఆహ్వానించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అధికారులు అందజేశారు.

పండుగ ఏర్పాట్లపై సమీక్ష

దర్శనం అనంతరం ఆలయ ఉద్యోగులతో సమావేశమైన కమిషనర్ హనుమంతరావు రాబోయే దసరా, సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, పండుగ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Views: 36

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..! గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..!
జోగిపేట నుంచి మరో అంబులెన్స్‌ రప్పించిన పైలెట్ చౌటకూర్  (సంగారెడ్డి) : అత్యవసర సమయంలో గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్‌ మార్గమధ్యంలో మొరాయించింది.శనివారం మధ్యాహ్నం పుల్కల్‌...
టిపిటిఎఫ్ దంతాలపల్లి మండల శాఖ నూతన కమిటి ఎన్నిక
గొంగ్లూర్ లో బతుకమ్మ ఘాట్ ను ప్రారంభించిన సర్పంచ్
10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య  
- వేటగాళ్ల ఉచ్చుకు రైతు మృతి, మాయమైన మృతదేహం..!
నాగ సముద్రాల పియంశ్రీ పథకం ద్వారా వచ్చిన పాఠశాల రెండు కోట్ల నిధులపై విచారణ జరిపి నిగ్గుతెల్చాలి 
దసరా సెలవుల్లో ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్.