పెయింటింగ్ యూనియన్‌కు స్థలం, రూ.50 వేల సాయం: ఎమ్మెల్యే హామీ

బెల్లంపల్లి / మంచిర్యాల జిల్లా : బెల్లంపల్లి నియోజకవర్గ పెయింటింగ్ అండ్ పుట్టీ యూనియన్ కార్యాలయ ఏర్పాటుకు త్వరలో స్థలం కేటాయించడంతో పాటు తన తరఫున రూ.50 వేల ఆర్థిక సహాయం అందిస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి హామీ ఇచ్చినట్లు యూనియన్ అధ్యక్షుడు ఎండీ ఆసిఫ్ తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థానిక మండలాల్లో పెయింటింగ్ పనులు చేయడంతో నియోజకవర్గ పెయింటర్లు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు బండి ప్రభాకర్ చొరవ తీసుకున్నారని తెలిపారు. అనారోగ్యం, మరణం వంటి సందర్భాల్లో యూనియన్ సభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, నియోజకవర్గంలోని పెయింటర్లందరూ యూనియన్‌లో చేరి సంఘాన్ని బలోపేతం చేయాలని ఎండీ ఆసిఫ్ కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


