ఆర్టీసీలో ఏఐటీయూసీ విజయం ఎర్రజెండాపై కార్మికుల నమ్మకానికి నిదర్శనం

- సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

WhatsApp Image 2026-10-10 at 4.06.16 AM (1)

సిపిఐ జిల్లా కార్యాలయంలో విజయోత్సవ సంబురాలు

హనుమకొండ  న్యూస్ : ​తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసి) గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో ఏఐటీయూసీ అనుబంధ ఎంప్లాయిస్ యూనియన్  రాష్ట్ర స్థాయి గుర్తింపు సంఘంగా చారిత్రాత్మక విజయం సాధించడం పట్ల సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు.​ఈ విజయోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏఐటియుసి, ఆర్టీసీ నాయకుల సమక్షంలో ఘనంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్మికులు,నాయకులు కేక్ కటి చేసి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ
​"ఆర్టీసీ ఎన్నికల్లో లభించిన ఈ అపార విజయం కేవలం ఒక యూనియన్ విజయం కాదని, ఇది యావత్ ఆర్టీసీ కార్మికుల విజయం అని, ఎర్రజెండా, ఏఐటీయూసీ పోరాట పటిమపై కార్మికులకు ఉన్న అచంచలమైన విశ్వాసానికి ఈ తీర్పు ప్రత్యక్ష నిదర్శనం అని తెలిపారు.

ఈ విజయం కోసం శ్రమించిన ఎంప్లాయిస్ యూనియన్ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే కూటమిగా ఏర్పడి మద్దతు తెలిపిన ఎన్ఎంయూ,టిఎంయూ తదితర కార్మిక సంఘాల నాయకులకు హృదయపూర్వక అభినందనలు." అని తెలిపారు. ​ఇటీవల ముగిసిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలతో పాటు, ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద రవాణా సంస్థ అయిన ఆర్టీసీ ఎన్నికల్లోనూ ఏఐటీయూసీ అనుబంధ సంఘాలు విజయం సాధించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్ల సాధనకు, ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తిస్థాయి అమలుకు, కార్మికుల సంక్షేమానికి సిపిఐ నిరంతరం అండగా ఉంటుందని, అసెంబ్లీ లోపల, వెలుపల కార్మికుల గొంతుకగా నిలుస్తుందని స్పష్టం చేశారు.​ఈ వేడుకల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి,మద్దెల ఎల్లేష్,ఏఐటియుసి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేల్పుల సారంగపాణి, జక్కు రాజు గౌడ్,జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి నేదునూరి రాజమౌళి, జిల్లా నాయకులు బత్తిని సదానందం, కొట్టేపాక రవి, మాలోతు శంకర్ నాయక్, దర్ముల రామమూర్తి, గుంటి రాజేందర్, యాకయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..! గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..!
జోగిపేట నుంచి మరో అంబులెన్స్‌ రప్పించిన పైలెట్ చౌటకూర్  (సంగారెడ్డి) : అత్యవసర సమయంలో గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్‌ మార్గమధ్యంలో మొరాయించింది.శనివారం మధ్యాహ్నం పుల్కల్‌...
టిపిటిఎఫ్ దంతాలపల్లి మండల శాఖ నూతన కమిటి ఎన్నిక
గొంగ్లూర్ లో బతుకమ్మ ఘాట్ ను ప్రారంభించిన సర్పంచ్
10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య  
- వేటగాళ్ల ఉచ్చుకు రైతు మృతి, మాయమైన మృతదేహం..!
నాగ సముద్రాల పియంశ్రీ పథకం ద్వారా వచ్చిన పాఠశాల రెండు కోట్ల నిధులపై విచారణ జరిపి నిగ్గుతెల్చాలి 
దసరా సెలవుల్లో ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్.