జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలి

WhatsApp Image 2026-10-10 at 7.21.26 AM (1)
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

రాయపర్తి (వరంగల్ జిల్లా) :  జనగామ జిల్లా ఏర్పడి దశాబ్ద కాలం అయినా సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్  చిత్ర పటానికి పాలాభిషేకం చేసి ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ జిల్లా శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి లు తెలిపారు.  దేవరుప్పుల మండలం కేంద్రంలో ఏర్విపాటు చేసిన మీడియా సమావేశంలో విలేకరులతో వారు మాట్లాడుతూ గత బిఅరెస్ కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. జనగామ జిల్లా ఏర్పడినాక జనగామ ప్రాంతం అనేక విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. జిల్లా ఏర్పడినాక నూతన జిల్లా కార్యాలయం, మెడికల్ కళాశాల, మాత శిశు ఆసుపత్రి, వల్మిడి, బమ్మెర పోతన, పాలకుర్తి సోమేశ్వర స్వామి ఆలయం, జిడికల్ దేవాలయం వంటివి అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లా ఏర్పాటు తరువాత దేవాదుల రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేసి ఎడారి ప్రాంతం అయిన జనగామ ను శస్యసమలంగా మార్చామని తెలిపారు. అదివారం జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించే వేడుకలకు జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్ నియోజవర్గ నాయకులు కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ మూడు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం మొత్తం కుని అయ్యిందని తెలిపారు. రేవంత్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేంది బిఅరెస్ పార్టీనే తెలంగాణ ను మళ్లీ   అభివృద్ధి చేసేది కెసిఆర్ నని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవరుప్పుల మండల బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..! గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..!
జోగిపేట నుంచి మరో అంబులెన్స్‌ రప్పించిన పైలెట్ చౌటకూర్  (సంగారెడ్డి) : అత్యవసర సమయంలో గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్‌ మార్గమధ్యంలో మొరాయించింది.శనివారం మధ్యాహ్నం పుల్కల్‌...
టిపిటిఎఫ్ దంతాలపల్లి మండల శాఖ నూతన కమిటి ఎన్నిక
గొంగ్లూర్ లో బతుకమ్మ ఘాట్ ను ప్రారంభించిన సర్పంచ్
10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య  
- వేటగాళ్ల ఉచ్చుకు రైతు మృతి, మాయమైన మృతదేహం..!
నాగ సముద్రాల పియంశ్రీ పథకం ద్వారా వచ్చిన పాఠశాల రెండు కోట్ల నిధులపై విచారణ జరిపి నిగ్గుతెల్చాలి 
దసరా సెలవుల్లో ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్.