ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి : అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్

WhatsApp Image 2026-10-10 at 3.43.05 AM

కాటారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ జిల్లా  అడిషనల్ ఎస్పీ 

కాటారం (భూపాలపల్లి) :  కాటారం పోలీస్ స్టేషన్‌ను భూపాలపల్లి జిల్లా  అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో పోలీసు సేవలను మరింత సమర్థవంతంగా అందించడమే లక్ష్యంగా జిల్లా అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ శనివారం కాటారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ  నరేష్ కుమార్ పోలీసు స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, కేసులను నాణ్యతతో దర్యాప్తు చేయాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, కాటారం ఎస్ఐ శ్రీనివాస్ ఉన్నారు.

 

Views: 270

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..! గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..!
జోగిపేట నుంచి మరో అంబులెన్స్‌ రప్పించిన పైలెట్ చౌటకూర్  (సంగారెడ్డి) : అత్యవసర సమయంలో గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్‌ మార్గమధ్యంలో మొరాయించింది.శనివారం మధ్యాహ్నం పుల్కల్‌...
టిపిటిఎఫ్ దంతాలపల్లి మండల శాఖ నూతన కమిటి ఎన్నిక
గొంగ్లూర్ లో బతుకమ్మ ఘాట్ ను ప్రారంభించిన సర్పంచ్
10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య  
- వేటగాళ్ల ఉచ్చుకు రైతు మృతి, మాయమైన మృతదేహం..!
నాగ సముద్రాల పియంశ్రీ పథకం ద్వారా వచ్చిన పాఠశాల రెండు కోట్ల నిధులపై విచారణ జరిపి నిగ్గుతెల్చాలి 
దసరా సెలవుల్లో ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్.