మూడు గ్రామాల్లో యూత్ కాంగ్రెస్ కమిటీల ఏకగ్రీవ ఎన్నిక...

నల్లబెల్లి (వరంగల్ జిల్లా) : మండలంలోని బుచ్చిరెడ్డిపల్లి, మూడు చెక్కలపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో నూతన యూత్ కాంగ్రెస్ కమిటీలను శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తం సురేష్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. బుచ్చిరెడ్డిపల్లి అధ్యక్షుడిగా భూక్య రాజకుమార్, మూడు చెక్కలపల్లి అధ్యక్షుడిగా మహ్మద్ అస్లాం, గొల్లపల్లి అధ్యక్షుడిగా ఇట్టబోయిన సందీప్ ఎన్నికయ్యారు. ఆయా గ్రామాల వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పురుషోత్తం సురేష్ మాట్లాడుతూ.. నూతన కమిటీలు గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. యువతను పార్టీకి మరింత చేరువ చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌ఛార్జులు, సర్పంచులు, పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


