గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్..!

- జోగిపేట నుంచి మరో అంబులెన్స్ రప్పించిన పైలెట్
చౌటకూర్ (సంగారెడ్డి) : అత్యవసర సమయంలో గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్ మార్గమధ్యంలో మొరాయించింది.శనివారం మధ్యాహ్నం పుల్కల్ నుంచి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి గర్భిణిని ప్రసవం కోసం తీసుకెళ్తుండగా తాడ్ దాన్‌పల్లి చౌరస్తా టోల్గేట్ సమీపంలో అంబులెన్స్ టైరు పంచరైంది. దీంతో గర్భిణిని ఆసుపత్రికి తరలించే క్రమంలో కొంత ఇబ్బంది ఎదురైంది.వెంటనే అప్రమత్తమైన అంబులెన్స్ పైలెట్ జోగిపేట నుంచి మరో 108 అంబులెన్స్‌ను రప్పించారు. అనంతరం గర్భిణిని మరో అంబులెన్స్‌లోకి మార్చి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అత్యవసర వైద్య సేవల్లో కీలకమైన 108 అంబులెన్స్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి,ప్రయాణ సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
.jpeg)
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


