నిజామాబాద్ బల్దియాలో విషాదం..!
.jpeg)
విధుల్లో ఉన్న మున్సిపల్ కార్మికుడు గుండెపోటుతో మృతి
నిజామాబాద్ : విధుల్లో ఉన్న మున్సిపల్ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు ఈ ఘటన నిజామాబాద్ నగరంలో శనివారం చోటుచేసుకుంది. నగరపాలక సంస్థలో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికుడు భూమయ్య శనివారం డివిజన్ నెంబర్. 57లో టాటా ఏస్ లోడర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఆకస్మాత్తుగా ఆయనకు ఫిట్స్ రావడంతో కింద పడిపోయాడు. వెంటనే స్పందించిన సానిటరీ ఇన్స్పెక్టర్ జీవన్, సిబ్బంది అతడిని నగరంలోని జీజీహెచ్ కు తరలించారు. పరీక్షించిన వైద్యులు ఫిట్స్ వచ్చిన తర్వాత అతడికి గుండెపోటు రావడంతో మృతి చెందాడని ధృవీకరించారు. దీంతో మున్సిపాలిటీలో విషాదం నెలకొంది.
.jpeg)
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


