ఘనంగా గడ్డం కేశవమూర్తి జన్మదిన వేడుకలు

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం
హనుమకొండ: టీయూడబ్ల్యూజే ఐజేయు హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి జన్మదిన వేడుకలను శనివారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు ఆయనకు శాలువా కప్పి సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ఆయన చేస్తున్న సేవలను పలువురు కొనియాడారు. జర్నలిస్టుల ఐక్యత కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు, జర్నలిస్టులకు మధ్య వారధిగా నిలుస్తూ వార్తా రంగంలో తనదైన పాత్ర పోషిస్తున్నారని అభినందించారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య, టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా కార్యదర్శి ఉటుకూరు సాయిరాం, కోశాధికారి విష్ణు వర్ధన్, టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంకణాల సంతోష్, తోట సుధాకర్, రాష్ట్ర హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ వల్లాల వెంకటరమణ, తెలంగాణ డిజిటల్ మీడియా ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన నాగరాజు, సీనియర్ జర్నలిస్టులు వేముల రాజేశ్వర్ రావు, దండు మోహన్, రజాక్, పాషా, సోమనర్సయ్య, దాసరి ధనుంజయ, సలెoద్ర రవీందర్, చెలిక రాజేంద్ర ప్రసాద్, సిద్దోజు రాకేష్, పలువురు జర్నలిస్టులు పాల్గొని కేశవమూర్తికి శుభాకాంక్షలు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


