దుర్గామాత విగ్రహాల ప్రతిష్ఠాపన, ఊరేగింపుల నిర్వాహకులు ఆన్‌లైన్‌లో సమాచారం అందించాలి

టూ టౌన్ సీఐ యాసిన్
కొత్తగూడెం బ్యూరో : దుర్గామాత విగ్రహాల ప్రతిష్ఠాపన, మండపాల ఏర్పాటు, ఊరేగింపులు నిర్వహించే నిర్వాహకులు పోలీసు శాఖకు ఆన్‌లైన్ ద్వారా ముందస్తు సమాచారం అందించాలని టూ టౌన్ సీఐ సూచించారు. దుర్గామాత ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. దుర్గామాత విగ్రహాల ప్రతిష్ఠాపన, ఊరేగింపులకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో “INTIMATION TO POLICE FOR INSTALLATION OF DURGA MATA IDOLS AND PROCESSION – 2026” పేరుతో ఆన్‌లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉందని తెలిపారు.
విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వాహకులు, మండపాల కమిటీ సభ్యులు https://policeportal.tspolice.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి, సంబంధిత ఆన్‌లైన్ ఫారమ్‌లో అడిగిన వివరాలను పూర్తిగా నమోదు చేసి సమర్పించాలని సూచించారు. ఆన్‌లైన్‌లో సమాచారం సమర్పించడంతో పాటు, వర్తించే నిబంధనల ప్రకారం అవసరమైన అనుమతులు కూడా పొందాలని స్పష్టం చేశారు. ఉత్సవాలు, ఊరేగింపుల సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని, పోలీసు శాఖ సూచనలు, భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా నిర్వహించాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


