ప్రతి పోలీసు విధులలో క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

శనివారం ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో పరేడ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ
- విధులలో నిజాయితీగా వ్యవహరించాలి
- షూరిటీలు ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని సూచన.
ఆదిలాబాద్ బ్యూరో : సిబ్బంది ప్రతి ఒక్కరూ యూనిఫామ్ కు ఉన్న గౌరవాన్ని పెంచే విధంగా విధులను నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు జరిగిన పరేడ్ నందు జిల్లా ఎస్పీ పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేయడం జరిగింది. మొదటగా ఆదిలాబాద్ జిల్లా పోలీసులు గణపతి నవరాత్రి ఉత్సవాలలో సిబ్బంది చేసిన విధులకు గాను అభినందించారు. అదేవిధంగా రానున్న నవరాత్రి ఉత్సవాలను సైతం అదే స్ఫూర్తితో విజయవంతం చేయాలని తెలియజేశారు. సిబ్బంది పరేడ్ ను, యూనిఫామ్ యొక్క ప్రాముఖ్యతపై వివరించి సిబ్బంది ధరించిన యూనిఫామ్ ను పరిశీలించారు.
విధులలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని వహించకుండా ఉండాలి
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి శనివారం పరేడ్ లేదా యోగా నిర్వహిస్తూ శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండాలని తెలిపారు. ముఖ్యంగా సిబ్బంది ప్రతిరోజు వ్యాయామం చేయాలని సూచించారు. సిబ్బంది ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరిగా ఉండాలని విధుల నందు ఎలాంటి నిర్లక్ష్యాన్ని వహించవద్దని, ముఖ్యంగా నిజాయితీతో వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా సిబ్బంది ఇతరులకు షూరిటీ (లోన్ నందు హామీ) ఇచ్చే సమయంలో సరైన వారికి ఇవ్వాలని లేని పక్షంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. విధులను నిర్వర్తిస్తున్న క్రమంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
త్వరలో సిబ్బంది అందరికీ మెడికల్ హెల్త్ క్యాంప్
శనివారం పరేడ్ నందు జిల్లాలోని అన్ని పోలీసు కార్యాలయాలలో మరియు ఏ ఆర్ హెడ్ క్వార్టర్స్ నందు పరేడ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. 50 సంవత్సరముల పైబడిన సిబ్బందికి ప్రత్యేకంగా యోగ నిర్వహించాలని తెలిపారు. సిబ్బంది అందరికీ త్వరలో మెడికల్ హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం జరుగుతుందని అనే సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ప్రైవేటు ఇన్సూరెన్స్లను తీసుకొని అత్యవసర ఆరోగ్య సమయాలలో వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, సిఐలు కె నాగరాజు, బి సునీల్ కుమార్, బి డి ప్రేమ్ కుమార్, ప్రణయ్ కుమార్, వెంకటేశ్వర్లు, రహీం పాషా, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి మురళి, ఎన్ చంద్రశేఖర్, సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

