కరెంటు కోత.. రైతు గోస..!

అక్కన్నపేట లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కరెంటు కోతలపై నిరసన ధర్నా

హుస్నాబాద్  : సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో విద్యుత్ కోతలను నిరసిస్తూ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల అధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి  అధ్యక్షతన అంబేద్కర్ చౌరస్తా నుండి విద్యుత్ సబ్‌స్టేషన్ వరకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి, వ్యవసాయానికి ఎలాంటి ఆటంకం కలగకుండా, వేళాపాళా లేని కోతలు లేకుండా రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయాలని పార్టీ అధ్యక్షులు డిమాండ్ చేశారు. సమయానికి కరెంట్ ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, కరెంట్ సరఫరా చేయలేని ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వైఖరికి వ్యతిరేకంగా సబ్‌స్టేషన్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

WhatsApp Image 2026-10-10 at 3.36.15 AM

రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉండాలని,రైతాంగాన్ని గోసపెడుతున్న విద్యుత్ కోతలను తక్షణమే ఎత్తివేసి, ప్రతి బోరుబావికి సరిపడా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని, లేనిపక్షంలో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, సిద్దిపేట జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు నునవతు  మోహన్ నాయక్, ఎస్టి మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి  గులోత్  తిరుపతి నాయక్, జిల్లా కో-ఆపరేటివ్ కన్వీనర్ జనగామ వేణుగోపాలరావు, జిల్లా కార్యవర్గ సభ్యురాలు మేడవెన సరూప, మండల ప్రధాన కార్యదర్శిలు చెరుకు సంపత్ ,మడక రవికుమార్, మండల ఉపాధ్యక్షులు బోనగిరి తిరుపతి, మాజీ సర్పంచ్ జిల్లాల అశోక్ రెడ్డి, ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గులొత్ లక్పత్ నాయక్, ఎస్టి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బానోతు  అనీల్, మండల కార్యదర్శి. లావుడ్య రైనా నాయక్, ముక్కిసమ్మిరెడ్డి, లింగారెడ్డి,సంజీవరెడ్డి,బానోతు సుమన్, సలేంద్ర తిరుపతి, గిరిమల రాజు, మాలోత్ రాజు, గంగుల కుమార్, జంగపల్లి శ్రీనివాస్, జంగపల్లి యాదగిరి, తేజ, బల మధు, రాయికుంట తిరుపతి,, జీల కనుకయ్య,  సత్యనారాయణ మిట్టపల్లి కుమార్, ఆవుల కుమార్ శ్రీకాంత్ , శ్రీనివాస్, సంజీవ్, కుస రాజు, రాజేష్,రమేష్, ముక్కెర అఖిల్, గడ్డం శ్రీకాంత్, గుగులోత్ రాజకుమార్,కార్యకర్తలు మరియు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.

 

 

Views: 18

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..! గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..!
జోగిపేట నుంచి మరో అంబులెన్స్‌ రప్పించిన పైలెట్ చౌటకూర్  (సంగారెడ్డి) : అత్యవసర సమయంలో గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్‌ మార్గమధ్యంలో మొరాయించింది.శనివారం మధ్యాహ్నం పుల్కల్‌...
టిపిటిఎఫ్ దంతాలపల్లి మండల శాఖ నూతన కమిటి ఎన్నిక
గొంగ్లూర్ లో బతుకమ్మ ఘాట్ ను ప్రారంభించిన సర్పంచ్
10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య  
- వేటగాళ్ల ఉచ్చుకు రైతు మృతి, మాయమైన మృతదేహం..!
నాగ సముద్రాల పియంశ్రీ పథకం ద్వారా వచ్చిన పాఠశాల రెండు కోట్ల నిధులపై విచారణ జరిపి నిగ్గుతెల్చాలి 
దసరా సెలవుల్లో ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్.