ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోడపట్ల గణేష్

చౌటకూర్ (సంగారెడ్డి) ; తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఎంగిలిపూల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని చౌటకూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోడపట్ల గణేష్ ప్రజలకు, మహిళలకు, ఆడపడుచులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, వివిధ రకాల పూలతో బతుకమ్మను అలంకరించి, సంప్రదాయబద్ధంగా ఆటపాటలతో ఈ పండుగను జరుపుకోవడం తెలంగాణ ప్రత్యేకత అని అన్నారు.బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని, ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ, వాటి గొప్పతనాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.మహిళలు, ఆడపడుచులు కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రజల మధ్య ఐక్యతను, ఆప్యాయతను మరింత పెంపొందించాలని కోరుకుంటూ మరోసారి అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


