గొంగ్లూర్ లో బతుకమ్మ ఘాట్ ను ప్రారంభించిన సర్పంచ్

చౌటకూర్ (సంగారెడ్డి) : పుల్కల్ మండలంలోని గొంగ్లూర్ గ్రామంలోని కట్ట మైసమ్మ దేవాలయం చెరువు కట్ట వద్ద బతుకమ్మ ఘాట్ నిర్మాణానికి గ్రామ సర్పంచ్ శగాలేటి యాదగిరి మరియు గ్రామ పెద్దలు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. దుర్గాష్టమి బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామ ఆడపడుచులు సంతోషంగా, సురక్షితంగా బతుకమ్మ ఆడుకోవడానికి ఆడిన తర్వాత బతుకమ్మ గంగమ్మ ఓడికి విడిచిపెట్టడానికి వీలుగా ఈ బతుకమ్మ ఘాట్ ను నిర్మిస్తున్నామని సర్పంచ్ తెలిపారు. గొంగ్లూర్ గ్రామ ప్రజలకు ముందుగా బతుకమ్మ పండుగ మరియు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్ గౌడ్, బ్రహ్మానంద రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


