మహిళలు, చిన్నారుల భద్రతకు షీ టీం నిరంతర కృషి : ఎస్పీ అఖిల్ మహాజన్

- నెలవారీ నివేదికలో 136 ఫిర్యాదులపై స్పందన

WhatsApp Image 2026-10-10 at 7.11.41 AM

  • 117 ఈ-పెట్టి కేసులు, 5 ఎఫ్ఐఆర్‌ల నమోదు

- మహిళలు, చిన్నారులు ఎలాంటి వేధింపులకు గురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలి 

ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మహిళలు, చిన్నారులు, విద్యార్థినుల భద్రతకు షీ టీం, పోలీస్ అక్క బృందాలు నిరంతరం కృషి చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వేధింపులకు గురయ్యే బాధితులకు అండగా నిలవాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. శనివారం పోలీసు ముఖ్య కార్యాలయంలో షీ టీం మరియు పోలీస్ అక్క బృందం చే నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. షీ టీం నెలవారీ నివేదిక ప్రకారం మొత్తం 136 ఫిర్యాదులు అందగా, వాటిపై స్పందించి 117 ఈ-పెట్టి కేసులు, 5 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. వేధింపులకు పాల్పడే వ్యక్తులను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, బాధితులకు తగిన సహాయ సహకారాలు అందించారు. 

163 హాట్‌స్పాట్లలో ఆకస్మిక తనిఖీలు.. 49 గ్రామాల్లో పర్యటనలు

మహిళలు, విద్యార్థినులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలు, పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, విద్యాసంస్థలు తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని వివిధ హాట్‌స్పాట్లలో 163 ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నెలరోజుల వ్యవధిలో 49 గ్రామాలను సందర్శించి మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతూ, నెలలో రెండు బాల్యవివాహాలను అడ్డుకోవడంలో షీ టీం బృందాలు కీలక పాత్ర పోషించాయి. బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరిస్తూ, ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే స్పందించాలని ఎస్పీ సూచించారు.

2 బాల్యవివాహాలను అడ్డుకుని, 48 అవగాహన కార్యక్రమాల నిర్వహణ

మహిళలు, చిన్నారులు పాఠశాలల్లో, కళాశాలల్లో, పని ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి వేధింపులకు గురైనా, ఈవ్ టీజింగ్ లేదా బ్యాడ్ టచ్ వంటి ఘటనలు ఎదురైనా భయపడకుండా పోలీస్ అక్క లేదా షీ టీం బృందాలను సంప్రదించాలని తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతకు భంగం కలిగించే వ్యక్తులపై ఎలాంటి ఉపేక్ష లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రత, బాల్యవివాహాల నివారణ, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై 48 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థినులు, మహిళలు తమ వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని, ఫొటోలు, వీడియోల దుర్వినియోగం లేదా ఆన్‌లైన్ వేధింపులు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పించారు.

ఉత్తమ ప్రతిభ కనబరిచిన షీ టీం సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు

ఈ సందర్భంగా విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన షీ టీం, పోలీస్ అక్క సిబ్బందిని ఎస్పీ అభినందించి, నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేసి ప్రోత్సహించారు. మహిళలు, చిన్నారుల రక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని సూచించారు.
మహిళలు, చిన్నారుల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఎలాంటి వేధింపులు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనా షీ టీం నంబర్ 8712659953 లేదా డయల్ 100/112కు సంప్రదించాలని ఎస్పీ సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతూ, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షి టీం సభ్యులు ఏఎస్ఐ సుశీల, హెడ్ కానిస్టేబుల్ వాణిశ్రీ, పోలీస్ అక్క సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..! గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..!
జోగిపేట నుంచి మరో అంబులెన్స్‌ రప్పించిన పైలెట్ చౌటకూర్  (సంగారెడ్డి) : అత్యవసర సమయంలో గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్‌ మార్గమధ్యంలో మొరాయించింది.శనివారం మధ్యాహ్నం పుల్కల్‌...
టిపిటిఎఫ్ దంతాలపల్లి మండల శాఖ నూతన కమిటి ఎన్నిక
గొంగ్లూర్ లో బతుకమ్మ ఘాట్ ను ప్రారంభించిన సర్పంచ్
10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య  
- వేటగాళ్ల ఉచ్చుకు రైతు మృతి, మాయమైన మృతదేహం..!
నాగ సముద్రాల పియంశ్రీ పథకం ద్వారా వచ్చిన పాఠశాల రెండు కోట్ల నిధులపై విచారణ జరిపి నిగ్గుతెల్చాలి 
దసరా సెలవుల్లో ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్.