పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెద్దకొత్తపల్లి మండలం చెన్నాపురావుపల్లిలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెద్దకొత్తపల్లి మండలం చెన్నాపురావుపల్లిలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్

 

పెద్దకొత్తపల్లి (నాగర్ కర్నూల్): నిరుపేద కుటుంబాల్లో నూతన వెలుగులు నింపుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తోందని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అన్నారు.పెద్దకొత్తపల్లి మండలం చెన్నాపురావుపల్లి గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్ల పురోగతిని, బిల్లులు, సమస్యలపై లబ్ధిదారులతో మాట్లాడి తెలుసుకున్నారు. అదే గ్రామంలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న పెబ్బేటి నిర్మలమ్మ నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నిర్మలమ్మ కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందాలని, నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సహకరించాలని, క్షేత్రస్థాయిలో పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ శ్రీనివాసులు, సర్పంచ్ వెంకటమ్మ, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ.
  బాన్సువాడ :  ప్రధానమంత్రి కిసాన్ నిధులను శుక్రవారం విడుదల చేసిన మోడీ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ   గుజరాత్ లో ప్రధాన మంత్రి కిసాన్ ఉత్సవ
బి.పి., షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు - నవంబర్ 1న నాగర్ కర్నూల్ లో వైద్య శిబిరం: డా. మణికంఠ జగదీష్
షంషీర్ నగర్ స్మశాన వాటికలో అక్రమ షెడ్డు తొలగింపు
పోచమ్మ ఆలయ గద్దెల కూల్చివేతపై బస్తీవాసుల ఆగ్రహం!
రాళ్లతో దాడి బాధితుడికి న్యాయం చేయాలి
భూ రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెద్దకొత్తపల్లి మండలం చెన్నాపురావుపల్లిలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్