హుస్నాబాద్ నియోజకవర్గంలోని సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్న మూడు మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ నియోజకవర్గంలోని సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్న మూడు మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలి

హుస్నాబాద్ :  ఎల్ నినో ప్రభావంతో సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, కరువు పరిస్థితుల కారణంగా ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.ఈ సందర్బంగా ఈ మూడు మండలాలను కూడా కరువు మండలాలుగా గుర్తించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు.ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవకపోవడంతో ఆయా మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు రానున్న రోజుల్లో తాగునీటి సమస్యలు సైతం ఎదురయ్యే అవకాశం ఉందని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు.హుస్నాబాద్ నియోజకవర్గంలోని మొత్తం ఏడు మండలాల్లో ఇప్పటికే రెండు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా గుర్తించారని, మిగిలిన ఐదు మండలాల్లోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని ముఖ్యమంత్రిని కోరారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తమ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరుతూ ఆయా మండలాలు, గ్రామాల్లో ప్రజలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారని మంత్రి తెలిపారు.ప్రజలు, రైతుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరువు మండలాలుగా గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

Views: 32

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఘనంగా సుప్రీత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా సుప్రీత్ రెడ్డి జన్మదిన వేడుకలు
కీసర : దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాస్ రెడ్డి కుమారుడు సుప్రీత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ...
తక్కువ నీటితో సాగు.. ఆగ్రో ఫారెస్ట్రీతో అదనపు ఆదాయం
కౌడిపల్లి నూతన ఎసై గా నీరేష్.. జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎసై
దండి స్వామీజీ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాధారణలు
ఓటు హక్కు వినియోగంపై యువతకు అవగాహన కల్పించాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్.
ఆదిలాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా గుట్టురట్టు*
3కోట్ల ఓట్ చోరీ కాంగ్రెసే - బీజేపీ నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్