అనోజిగూడ డంపింగ్ యార్డును తరలించే వరకు పోరాటం ఆగదు:ఏనుగు సుదర్శన్ రెడ్డి

రావుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డు తరలింపు కోసం ధర్నా , రెండు నెలల్లో డంపింగ్ యార్డును పూర్తిగా తరలిస్తామని అధికారుల హామీ

అనోజిగూడ డంపింగ్ యార్డును తరలించే వరకు పోరాటం ఆగదు:ఏనుగు సుదర్శన్ రెడ్డి

- శాశ్వత పరిష్కారం చూపే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం,
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ అనోజిగూడ డంపింగ్ యార్డును పూర్తిగా తరలించి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలనే డిమాండ్‌తో రావుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షులు గొంగళ్ల బాలేష్, తో పాల్గొని డంపింగ్ యార్డు తరలింపు డిమాండ్‌కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి, మాట్లాడుతూ, అనోజిగూడ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డును పూర్తిగా తరలించే వరకు తమ పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

రెండు నెలల్లో తరలిస్తామని అధికారుల హామీ : డంపింగ్ యార్డు తరలింపు అంశంపై స్పందించిన అధికారులు, రెండు నెలల్లో డంపింగ్ యార్డును పూర్తిగా తరలించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు నాయకులు వెల్లడించారు. ఈ హామీని అధికారులు ఆచరణలో పెట్టి, నిర్ణీత గడువులోగా తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని వారు కోరారు. శాశ్వత పరిష్కారం వచ్చే వరకు ఉద్యమం : డంపింగ్ యార్డు తరలింపు విషయంలో కేవలం హామీలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో స్పష్టమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ప్రజలకు శాశ్వత పరిష్కారం లభించే వరకు ప్రజల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనోజిగూడ డంపింగ్ యార్డు తరలింపు విషయంలో అధికారులు ఇచ్చిన హామీ మేరకు చర్యలు తీసుకుంటారా? నిర్ణీత రెండు నెలల్లో తరలింపు ప్రక్రియ పూర్తవుతుందా? అన్నది వేచి చూడాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ రూరల్ జిల్లా కార్యవర్గ సభ్యులు అజయ్ యాదవ్, జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి శివనాయక్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ప్రణయ్, సీనియర్ నాయకులు వీరారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, జిహెచ్ఎంసి బీసీ సంఘం ఉపాధ్యక్షులు అఖిలభారత రజక సంఘం ప్రధాన కార్యదర్శి కొమ్మరాజు సతీష్, జోగు అఖిల్, పరశురాం, డంపింగ్ యార్డ్ బాధితులు,యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన
చౌటకూర్ : విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయ కళలు, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ‘స్పిక్ మెకే’ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ జిల్లా పరిషత్...
అల్లాదుర్గంలో ట్రాన్స్ఫార్మ్ ను కప్పేసిన తీగలు
దీపావళి బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి
విద్యార్థుల పై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే పోచారం.
బాన్సువాడ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
మున్సిపల్ అధికారులకు జీహెచ్ఎంసీ–ఏఎస్సీఐ ఆధ్వర్యంలో సామర్థ్య అభివృద్ధి కార్యక్రమం