విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించాలి:

మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి,

విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించాలి:

చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌ వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ,

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడంతోపాటు, వారిలో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి టాలెంట్‌ టెస్టులు దోహదపడతాయని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌ వాల్‌ పోస్టర్‌ను సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని విద్యాశాఖ చాంబర్లో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ, విద్యార్థులు పాఠ్యాంశాలతోపాటు సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంచడంతోపాటు, వారి ప్రతిభను ప్రదర్శించేందుకు చక్కని వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.

శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి : ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడంతోపాటు, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు చెకుముకి టాలెంట్‌ టెస్టులు దోహదపడతాయని అన్నారు. విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ, ప్రతి అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించాలని సూచించారు. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని, పరిశీలనా శక్తిని పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.. ఈ టాలెంట్‌ టెస్టులను నవంబర్‌ 12న పాఠశాల స్థాయిలో, నవంబర్‌ 21న మండల స్థాయిలో, నవంబర్‌ 28న జిల్లా స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం డిసెంబర్‌ 11, 12, 13 తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతిభను చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఎడి, జన విజ్ఞాన వేదిక మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాస్, కోశాధికారి జెన్నీ, కీసర మండలం ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ హెడ్ మాస్టర్ శేషగిరిరావు, సీనియర్ రిపోర్టర్ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన
చౌటకూర్ : విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయ కళలు, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ‘స్పిక్ మెకే’ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ జిల్లా పరిషత్...
అల్లాదుర్గంలో ట్రాన్స్ఫార్మ్ ను కప్పేసిన తీగలు
దీపావళి బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి
విద్యార్థుల పై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే పోచారం.
బాన్సువాడ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
మున్సిపల్ అధికారులకు జీహెచ్ఎంసీ–ఏఎస్సీఐ ఆధ్వర్యంలో సామర్థ్య అభివృద్ధి కార్యక్రమం