విద్యా వ్యవస్థలో ప్రైవేట్ సంస్థల పాత్ర కీలకం
సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ వై.ఎల్ శ్రీనివాస్ 42 పాఠశాల కరస్పాండెంట్ లకు విద్యా ప్రదాత పురస్కారం
నిజామాబాద్ : విద్యా వ్యవస్థలో ప్రైవేట్ విద్యా సంస్థల పాత్ర ఎంతో కీలకమని సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఫౌండర్ గ్రూప్ ట్రస్మా నిజామాబాద్ ఆధ్వర్యంలో
25 సంవత్సరాలు విశేష సేవలు అందించిన 42 మంది కరెస్పాండెంట్ లకు విద్యా ప్రదాత పురస్కార మహోత్సవ కార్యక్రమం ఆదివారం నగరంలోని శ్రీ రామ గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రిబల్ యూనివర్సిటీ వై ఎల్ శ్రీనివాస్,గౌరవ అతిథిగా ఇంచార్జీ జిల్లా విద్యాశాఖాధికారి దామర సాయగౌడ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ కే. కృష్ణారావు, రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఎన్ రెడ్డి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాపిరెడ్డి, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల యాజమాన్యాలు, పాఠశాలల ఉపాధ్యాయులు
హాజరయ్యారు. ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వాహకులు ఎంతో కష్ట నష్టాలను తట్టుకొని విద్యా సంస్థలను నడుపుతున్నారన్నారు.ముఖ్య అతిథులకు నిజామాబాద్ జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో ఘనంగా శాలువా మెమెంటుతో సత్కరించారు. అనంతరం ముఖ్య అతిథులు అతిథుల చేతుల మీదుగా జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న ట్రస్మా పాఠశాలల యాజమాన్యాలను, పాఠశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులను విద్యా ప్రదాత పురస్కారాలలో భాగంగా సన్మానించారు. సుమారు వందమందికి విద్యా ప్రదాత పురస్కారాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు శ్యాంసుందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కే. కిషోర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి రెడ్డి సత్యనారాయణ, జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల యాజమాన్యాలు, అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


