ఎల్‌నినో ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న మాస్టర్ మైండ్స్ విద్యార్థులను అభినందించిన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్

ఎల్‌నినో ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న మాస్టర్ మైండ్స్ విద్యార్థులను అభినందించిన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్

ఆదిలాబాద్ బ్యూరో : అదిలాబాద్ పట్టణంలో ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చిన ది మాస్టర్ మైండ్స్ స్కూల్-2 విద్యార్థులను మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ పాల్గొని విద్యార్థులు చేపట్టిన అవగాహన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదల, వర్షపాతం తగ్గుదల, కరువు పరిస్థితులు, వ్యవసాయంపై పడే ప్రభావం తదితర అంశాలను వివరిస్తూ విద్యార్థులు పట్టణ ప్రజలకు అవగాహన కల్పించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. చిన్న వయసులోనే పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై అవగాహన కలిగి ఉండటమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొనడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఎల్‌నినో వంటి వాతావరణ పరిణామాల వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలపై ప్రజలకు ముందస్తు అవగాహన కల్పించడం ఎంతో అవసరమని తెలిపారు.
ప్రతి ఒక్కరూ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, విద్యుత్‌ను ఆదా చేయాలని, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటడం, ప్రకృతిని కాపాడటం వంటి మంచి అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో సామాజిక బాధ్యతతో పాటు పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెరుగుతుందని అన్నారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న సమస్యలపై అవగాహన పెంచుకొని, ప్రజలకు మంచి సందేశాన్ని అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇలాంటి సామాజిక అవగాహన కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ది మాస్టర్ మైండ్స్ స్కూల్-2 యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గంట జీవన్ పాల్గొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన
చౌటకూర్ : విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయ కళలు, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ‘స్పిక్ మెకే’ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ జిల్లా పరిషత్...
అల్లాదుర్గంలో ట్రాన్స్ఫార్మ్ ను కప్పేసిన తీగలు
దీపావళి బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి
విద్యార్థుల పై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే పోచారం.
బాన్సువాడ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
మున్సిపల్ అధికారులకు జీహెచ్ఎంసీ–ఏఎస్సీఐ ఆధ్వర్యంలో సామర్థ్య అభివృద్ధి కార్యక్రమం