ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం బుర్కపల్లి గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల సంబరాలు – దీపావళి వేడుకలు

ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు కుడుమేత వనిత ఇంట్లో దీపాలు వెలిగించి సంబరాల్లో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఏ ఎం సి చైర్మన్ బోరంచు

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం బుర్కపల్లి గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల సంబరాలు – దీపావళి వేడుకలు

ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం బుర్కపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇందిరమ్మ సంబరాలు – దీపావళి వేడుకల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు కుడుమేత వనిత ఇంటికి వెళ్లి, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించి దీపావళి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు వనిత గారిని శాలువాతో సన్మానించి, ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి అనే రెండు లక్ష్యాలతో ప్రజాపాలన కొనసాగిస్తోందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన నిరుపేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడం ద్వారా వారి జీవితాల్లో భరోసా, భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని అన్నారు.
అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని వివరించారు. ఇందిరమ్మ ఇల్లు అనేది కేవలం నాలుగు గోడల నిర్మాణం మాత్రమే కాదు, పేద కుటుంబాల ఆత్మగౌరవానికి, భద్రమైన భవిష్యత్తుకు ప్రతీక అని డాక్టర్ నరేష్ జాదవ్ పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపావళి పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రతి పేద కుటుంబం సొంతింటిలో సంతోషంగా పండుగలు జరుపుకోవాలన్నదే ప్రజా ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపురావు , మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, మండల అధ్యక్షులు సుదర్శన్, హన్ను పటేల్, సర్పంచులు కామన్‌వార్ అశోక్, దాసరి రమేష్, తానాజీ, మోహన్ రావు, కౌడల నారాయణ, రాజారెడ్డి , వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ
భువనగిరి :  రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.. స్వాగతం
హెచ్ఐవి నియంత్రణలో జిల్లాకు సురక్షిత గుర్తింపు
ఆధ్యాత్మికతతో శాంతిని నెలకోల్పాలి
59వ గ్రంథాలయ వారోత్సవాల్లో బిట్స్ జయకేతనం
మద్యం మత్తులో పొలంలో పడి వ్యక్తి మృతి
జీవితభీమా పధకానికి నమోదు చేసుకోవాలి