హుస్నాబాద్ ను విద్యా వైద్య క్రీడా రంగంలో అభివృద్ధి చేస్తాం

గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత నాదే హుస్నాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టిబడి ఉంది భీమదేవరపల్లికి విజ్ఞాన కేంద్రం,ఎల్కతుర్తికి కోర్టు మంజూరు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ ను విద్యా వైద్య క్రీడా రంగంలో అభివృద్ధి చేస్తాం

హుస్నాబాద్ :  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేస్తామన్నారు.గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది ఈ ప్రభుత్వానిదేనన్నారు.గత ఏడాది హుస్నాబాద్ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని,ప్రస్తుతం మరో 2,000 ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామన్నారు.
దీపావళి వేడుకలను ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులతో కలిసి జరుపుకోవాలన్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టు,రోడ్డు విస్తరణలో, పారిశ్రామిక కారిడార్ లో భూములు కోల్పోయిన వారికి ఇళ్లు కోల్పోయి అర్హత ఉండి ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామన్నారు.నవంబర్ 19న ఇందిరమ్మ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీచేస్తామన్నారు. నియోజకవర్గంలో 136 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని,రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దన్నారు.జనవరి లో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామని,అనంతరం రైతు మేళా ఏర్పాటు చేస్తామన్నారు.దివ్యాంగులువృద్ధులకు ఉచితంగా ఉపకరణాలు అందిస్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకం కింద పొలాలకు వెళ్లే దారులు పనులు పూర్తిచేస్తామన్నారు. క్రీడా మైదానాల ఏర్పాటుకు ప్రతి గ్రామానికి లక్ష రూపాయలు విడుదల చేస్తామన్నారు. హుస్నాబాద్ లో స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధి ఇస్తామని తెలిపారు. అర్బన్ ఫారెస్ట్ పార్కు అభివృద్ధి చేస్తున్నామని నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ పార్కు తీసుకురాబోతున్నామని తెలిపారు. భీమదేవరపల్లి మండలానికి విజ్ఞాన కేంద్రం మంజూర అయిందని,ఎల్కతుర్తికి కోర్టు మంజూర అయిందని తెలిపారు.నియోజకవర్గంలో విద్యా, వైద్య,క్రీడా పరంగా ఆలయాలను, చెరువులను అభివృద్ధి చేస్తున్నామన్నారు.హుస్నాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.హుస్నాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.

Views: 24

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం
కొత్తగూడెం బ్యూరో : డిజిటల్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఇతరులతో పంచుకోవద్దని కొత్తగూడెం సబ్ ఇన్‌స్పెక్టర్ జుబేదా...
దీపావళి వేడుకల్లో తగు జాగ్రత్తలు పాటించాలి: యువత, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలి – పుల్కల్ ఎస్ఐ విశ్వజన్
డీఈవో చేతుల మీదుగా బహుమతులు అందుకున్న సిద్ధార్థ విద్యార్థులు
మోడల్ స్కూల్ లో పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం
మునుగోడులో ఘనంగా సుంకరి బిక్షం గౌడ్ విరమణ వేడుక.
చేగుంట బస్టాండ్ దుస్థితి మార్చే వారే లేరా
ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వెలుగులు నింపాలి