ప్రతి షాపు జిఎస్టి బిల్లులు ఇవ్వాలి!!
నిబంధనలతో పాటించని దుకాణాలపై చర్యలు తీసుకోవాలి
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో భోగి, దీపావళి పండుగల సందర్భంగా విరివిగా బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారని,సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం శబ్ద కాలుష్యం తక్కువగా డేసి బుల్స్ ఉండే బాంబులు మరియు ప్రజల కు శ్వాసకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగని గ్రీన్ క్రాకర్స్ బాంబులు అమ్మాలని సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగిందని బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి పశ్చిమ రవీందర్ గౌడ్ తెలిపారు.అదేవిధంగా ప్రతి షాపుకు మూడు మీటర్ల దూరం, ప్రతి షాపులో ఎలక్ట్రిక్ లైట్, ఇసుక తో కూడిన దుకాణం, ప్రతి షాపు వద్ద రెండు డ్రమ్ములలో నీరు, అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ ఇంజన్ తదితర సౌకర్యాలు తప్పకుండా ఉండాలని కోరారు. ఊరుకు దూరంగా ప్రజలకు ఇబ్బంది కలగని ప్రదేశాలలో ఏర్పాటు చేసుకోవాలని తెలియజేయడం జరిగిందన్నారు.అదేవిధంగా ప్రతి కొనుగోలుదారునికి జీఎస్టీ బిల్లులు ఇవ్వాలని, ఎమ్మార్పీ రేటు ప్రకారం అమ్మాలని తెలియజేశారు.ఇట్టి విషయంలో మున్సిపల్ సిబ్బంది, ఫైర్ అధికారి పర్యవేక్షణ చేసి దుకాణదారులకు తగు సూచనలు ఇవ్వవలసిందిగా బిఎస్పి పార్టీ పక్షాన కోరడం జరుగుతుందన్నారు. నిబంధనలు పాటించని దుకాణాలపై చర్యలు తీసుకోవాలని పచ్చిమట్ల రవీందర్ గౌడ్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


